పన్ను వసూళ్లపై సమీక్ష సమావేశం
ప్రాపర్టీ టాక్స్ నూరు శాతం వసూళ్లు చేసే దిశలో చర్యలు తీసుకోవాలని అధికారులను పురపాలక శాఖ జే.డి రమణి ఆదేశించారు. నగర పాలక సంస్థ కార్యాలయంలో మున్సిపల్ కమీషనర్ హరినాథ్ రెడ్డి, రెవెన్యూ ఆఫీసర్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లతో ఆమె పన్ను వసూళ్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సీనియర్ అధికారులు, జూనియర్ అసిస్టెంట్లతో కలిపి కలెక్షన్స్ టీంలు ఏర్పాటు చేయాలని సూచించారు. మొండి బకాయిలు ఉంటే జప్తు చేయాలని ఆదేశించారు. నీటి పన్ను వసూళ్లను కూడా నెలాఖరు లోపు వంద శాతం పూర్తి చేయాలని చెప్పారు. పెద్ద మొత్తంలోనీటిబకాయిలు ఉంటే సంబందిత కుళాయి కనెక్షన్లను తొలగించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన బిల్డింగ్‌ల ట్యాక్స్‌లను కూడా వసూళ్లు చేయాలని చెప్పారు. పన్ను వసూళ్లకు సంబంధించి ప్రతి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మున్సిపల్ కార్యాలయంలో వసూళు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పన్నులు కట్టేందుకు వచ్చే పబ్లిక్కు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎండతీవ్రత ఎక్కువగా ఉన్నందును తగు సదుపాయాలు కల్పించాలని సూచించారు